Telangana

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు..

అభివృద్ధికి చిరునామా పటాన్‌చెరు

అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు 

77 మీటర్ల జాతీయ జెండాతో మార్చ్ ఫాస్ట్

4 లక్షల 40 వేల రూపాయల సొంత నిధులచే నగదు బహుమతులు పంపిణీ..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సహకారం..ప్రజల అండదండలతో పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. జిహెచ్ఎంసి, మైత్రి మైదానం, ఎంపీడీవో, ఎమ్మార్వో, ముదిరాజ్ భవన్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  మినీ ఇండియాగా పేరుందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలను సాధిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా అశ్వాలతో కలిసి 77 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన మార్చి ఫాస్ట్ అందర్నీ అలరించింది. అనంతరం నియోజకవర్గ పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ ఫాస్ట్ అందరినీ అలరించాయి. వివిధ అంశాల్లో విజేతలుగా నిలిచిన పాఠశాలలకు ప్రథమ బహుమతి 20 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి 15 వేల రూపాయలు, తృతీయ బహుమతి 10 వేల రూపాయలు, పోటీలో పాల్గొన్న ప్రతి పాఠశాలకు 5000 రూపాయల చొప్పున 4 లక్షల 40 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పటాన్‌చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి జైపాల్, మాజీ కార్పొరేటర్ సపానదేవ్,తహసిల్దార్ హరి బాబు, ఎంపీడీవో యాదగిరి, డీఎస్పీ ప్రభాకర్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఎంఈఓలు నాగేశ్వరరావు నాయక్, రాథోడ, సీఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో ఘనంగా ముగిసిన 36వ మైత్రి ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన ఎస్సార్ గ్రూపు జట్టు మనవార్తలు ప్రతినిధి…

4 hours ago

దేశభక్తి స్ఫూర్తితో గీతంలో 77వ గణతంత్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం…

17 hours ago

మియాపూర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో వైభవంగా గణతంత్ర వేడుకలు మనవార్తలు ప్రతినిధి , మియాపూర్‌: గణతంత్ర దినోత్సవం అనేది కేవలం…

17 hours ago

వ్యవసాయ యాంత్రీకరణతో అధిక ఉత్పత్తులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

64 మందు రైతులకు 20 లక్షల రూపాయల సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

2 days ago

నైపుణ్యాభివృద్ధే భవితకు భరోసా

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన సీనియర్ డేటా సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పరిశ్రమ అవసరాలకు…

2 days ago

శ్రీ సాయి చైతన్య హై స్కూల్‌లో వసంత పంచమి వేడుకలు

చిన్నారులకు అక్షరాభ్యాసం – విద్యాభివృద్ధికి శుభారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి కృపతో…

3 days ago