ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి :
మహా శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో గురుజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్బంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. ఈ మేరకు ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని వడ్డించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ కోరికలు తీర్చే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయంలో మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉందని, వాటికి సంబంధించిన అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ముందుగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారికి స్వాగతం పలికి, సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉపేంద్ర బాబు, టీడీపి నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…