Telangana

వారసత్వ రాజకీయాల గురించి మీరా మాట్లాడేది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎమ్మెల్యే జిఎంఆర్ ధ్వజం..

_ప్రతి గ్రామంలో మహనీయుల విగ్రహాలు..

_ఏప్రిల్ 12, 13, 14, 16 తేదీలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ బసవేశ్వర విగ్రహాల ఆవిష్కరణలు..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసి డివిజన్ల పరిధిలో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఆదివారం పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మహనీయుల స్ఫూర్తిని అందించేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం, గ్రామ కూడలిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశామని, త్వరలో మిగిలిన గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈనెల 12వ తేదీన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల తండా, 13న కొల్లూరు గ్రామంలో, 14న పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ చౌరస్తాలలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. 16వ తేదీన బీరంగూడ చౌరస్తాలో మహాత్మ బసవేశ్వరుడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విగ్రహావిష్కరణల కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

దీంతోపాటు గ్రామస్తుల కోరిక మేరకు ఇస్నాపూర్ చౌరస్తాలో చిట్కుల్ గ్రామానికి వెళ్లే ముఖ ద్వారం వద్ద చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు అన్నట్లు తెలిపారు. చాలా గ్రామాల్లో ఇప్పటికే శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారుపటాన్చెరు డివిజన్ జిహెచ్ఎంసి వార్డు కార్యాలయం ఏర్పాటు కోసం జాతీయ రహదారి పక్కన.. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలో 500 గజాల స్థలం కేటాయించడంతో పాటు 6 కోట్ల రూపాయలు నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం చేపట్టి, మొదటి అంతస్తులో వార్డు, కార్యాలయం, మిగిలిన అంతస్తుల్లో ప్రెస్ క్లబ్, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజల కోసం వారి వారి భాషల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నూతన వార్డు కార్యాలయం నిర్మాణం పూర్తయితే.. పటాన్చెరు డివిజన్ ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందించడం సాధ్యమవుతుందని తెలిపారు.మినీ ఇండియా గా పేరిందిన పటాన్చెరు నియోజకవర్గంలో దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారని, వారి కోసం వారి వారి భాషల్లో చదువుకునేందుకు వీలుగా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.అనునిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల కోసం.. ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు తమ వార్తలను పంపించుకోవడంతోపాటు సమావేశాలు ఏర్పాటు చేసుకునేలా వీలుగా అన్ని వసతులు నూతన భవనంలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తో పాటు వీటికి సైతం శంకుస్థాపన చేస్తామని తెలిపారు..వీటితో పాటు అతి త్వరలోనే నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయబోతున్నట్లు తీపి కబురు అందించారు. ఇందుకి సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు.అనంతరం ఇస్నాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.

సికింద్రాబాద్లో జరిగిన బిజెపి బహిరంగ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్రంగా ఖండించారు. కుటుంబ పరిపాలన గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దేశంలో కుటుంబ పరిపాలన సాగిస్తున్న పార్టీలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ మరోపక్క కుటుంబ పాలన అంటూ మాట్లాడడం ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిల్లి గవ్వ అందించకుండా తిరిగి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని. రాబోయే ఎన్నికల్లో బిజెపిని తరిమి తరిమి కొడతారని అన్నారు.

ఈ సమావేశంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ గ్రామ కమిటీ, అనుబందల సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago