* ఆలయం ప్రథమ వార్షికోత్సవానికి ఆహ్వానించిన కమిటీ
* కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు మండలం చిట్కుల్ లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు . అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నీలం మధు ముదిరాజ్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ చిట్కుల్ లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు చాల సంతోషంగా ఉందని అన్నారు. భగవంతుడి దయవల్ల రాష్ట్రం లోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ,స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, నారాయణరెడ్డి, నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, వీరస్వామి, అంజిరెడ్డి, ఆలయ కమిటీ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…