Hyderabad

చిన్నారి ప్రాణానికి ఎండిఆర్ ఫౌండేషన్  10 వేల రూపాయల ఆర్థిక సహాయం

హైదరాబాద్

పరిస్థితులు అనుకూలించని కారణంగా ఏడు నెలలకే చిన్నారి జన్మించింది. కానీ విధి ఆ పాపకు కఠోర పరీక్ష పెట్టింది. సరైన మోతాదులో మెదడు అభివృద్ధి చెందలేక ప్రస్తుతం ఏడురోజుల ఆ చిన్నారి హైదరాబాద్ మదీనాగూడ లోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇదే పరిస్థితిలో తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఇరువురు చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లి పిల్లలను రక్షించుకునేందుకు ఆ కుటుంబం యావత్ దారబోస్తుంది. వీరి చికిత్సకు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో వారికున్న ఆస్తి అమ్ముకుని ఖర్చు పెట్టారు. . ఆసుపత్రి బిల్లులు కట్టడానికి అవస్థలు ఎదుర్కొంటున్నారు.

బీహెచ్ఈఎల్ ఎమ్ఐజి లో నివాసముండే ఆ కుటుంబం పేదరికం వల్ల చిన్నారి ప్రాణహాని పరిస్థితి ఏర్పడింది. ఆ చిన్నారికి జన్మనిచ్చిన తల్లి ప్రణీత ఎలాగైనా తన కూతురును కాపాడుకోవాలని ఆరాటపడుతుంది. ఇలాంటి సమయంలో వారి ఇంటికి సమీపంలో ఉండే రామచంద్రపురం ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది అనురాధ ఈ విషయాన్ని ఎండిఆర్ ఫౌండేషన్ దృష్టికి తీసుకు వచ్చారు . దేవేందర్ రాజు  సహృదయంతో వెంటనే స్పందించి . మంగళవారం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. పేదలకు ఎల్లవేళలా అండగా నిలబడుతున్న ఈ ఫౌండేషన్ ప్రతినిధులను అందరూ ప్రశంసిస్తున్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago