పటాన్చెరులో ఘనంగా పంచాంగ శ్రవణం
హాజరైన ప్రజా ప్రతినిధులు, పట్టణ పుర ప్రముఖులు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రజల జీవితాల్లో నూతన కాంతి వెలుగులు నింపాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభిలాషించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రాశి ఫలాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, మాజీ జడ్పీటీసీ జైపాల్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, ప్రతాప్ గౌడ్, ప్రకాష్ రావు, మాజీ ఎంపిటిసి రామచంద్ర రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
దేవాలయాల సందర్శన
ఉగాది పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం, పటాన్చెరు పట్టణ పరిధిలోని చైతన్య నగర్ హనుమాన్ దేవాలయాలను ఎమ్మెల్యే జిఎంఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, రుద్రారం సొసైటీ చైర్మన్ పాండు, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, వెంకన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.
5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…
-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…