Hyderabad

మాస్కే శ్రీరామ రక్ష….

మాస్కే శ్రీరామ రక్ష….

-డాక్టర్ జీవీఎస్‌ రావు

హైదరాబాద్ సిి :

భౌతిక దూరం పాటించడంతో పాటు… మాస్క్ ధరించడంతోనే కరోనా గోలుసును తెంపవచ్చని డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు .

హైదరాబాద్ ఎంజీబీఎస్, కాచీగూడ రైల్వే స్టేషన్ , కేపీహెచ్‌బీ బస్టాండ్‌లో డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ,హైదరాబాద్‌ ఈఎన్‌టీ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా వలస కూలీలకు, ప్రయాణీకులకు ఉచితంగా మాస్కులు , వాటర్‌ బాటిల్స్‌, ఆహార పదార్థాల పంపిణీ చేశారు. 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ,కోవిద్ వచ్చినా త్వరగా కోలుకుంటారని చెప్పారు. కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్‌లు ,గ్లౌజ్‌లు, శానిటైజర్లు వాడాలని పిలుపునిచ్చారు.

కోవిద్ 19 అనేది శ్వాసకోస వ్యాధి అని … దగ్గినప్పుడు ,తుమ్మినప్పుడు ,తుంపర్ల ద్వారా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుందని డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం ద్వారానే కోవిద్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చన్నారు .ఇలా ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా మాస్క్‌ సాయం చేస్తే .. కొంత మంది పేదలైనా కరోనా బారిన పడకుండా కాపాడుకోగలుగుతామన్నారు. భాగ్యనగరంలో పది వారాల పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉచితంగా లక్ష మాస్కులు, వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు డాక్టర్ రావ్ తెలిపారు.

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago