Telangana

నాణ్యత ప్రమాణాలతో ఇష్టా జూనియర్ కళాశాల నిర్వహణ

ఇష్టా జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ

జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నాణ్యత ప్రమాణాలతో నే ఇష్టా జూనియర్ కళాశాల నిర్వహణ కొనసాగుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా అధికారి (డిఐఈఓ)గోవింద్ రామ్ పేర్కొన్నారు. పటేల్ గూడ లోని ఇష్టా జూనియర్ కళాశాలలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారనే వచ్చిన వార్తలపై మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి గోవింద్ రామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ ను పరిశీలించడంతోపాటు విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ‌ కళాశాలకు గుర్తింపు లేదనే ప్రచారం అసత్యమని, గుర్తింపు ఉంది కాబట్టే విద్యార్థులు పరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా హాల్ టికెట్లు అందజేశామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇష్టా జూనియర్ కాలేజీలోకి బయట వ్యక్తులు వచ్చి న్యూసెన్స్ చేశారని అన్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారమే కళాశాల నిర్వాహణ కొనసాగుతుందని చెప్పారు. జిల్లా అధికారితో పాటు ఇష్టా జూనియర్ కాలేజీ అకాడమిక్ డీన్, ప్రేమ్ కుమార్, ప్రిన్సిపల్ దీప, తదితరులు ఉన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago