Telangana

నిరుద్యోగ మార్చ్ విజయవంతం చేయండి : గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ న్ విజయవంతం చేయాలని గడిల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి నుండి కొత్త బస్టాండ్ వరకు జరిగే నిరుద్యోగ మార్చ్ న్  భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నిరుద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు . బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంతంత మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాళీలను గుర్తించి ,ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు .

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లుగా బయటికివస్తున్నారని..వారికి తగిన ఉపాధి అవకాశాలు లేక కూలీ పనులు చేసుకుంటున్నారని గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. యువతే దేశానికి పెద్ద వనరులు అని ప్రకటిస్తున్న ప్రభుత్వం ఆ యువతను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో సైతం అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు .సంగారెడ్డిలో ఈ నెల 11 వ తేదీన బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్కు బీజేపీ నేతలు ,కార్యకర్తలు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

admin

Recent Posts

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

22 minutes ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago