_చిల్లర రాజకీయాలు మానుకోండి
_ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ హితవు
అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :
ఆధారాలతో కూడిన సహేతుక ఆరోపణలు చేస్తే సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని,
అధికార పార్టీని బదనాం చేయాలన్న కుటిల బుద్ధితో చిల్లర ఆరోపణలు చేస్తే ప్రజలు చీత్కరించుకుంటారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు.
సోమవారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన అమీన్పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే.. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఓర్వలేక అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని శంభునికుంట చెరువు పరిధిలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కబ్జాలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల విమర్శిస్తున్నాయని, ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని అన్నారు గతంలో సర్వే ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ పై వివిధ రకాల విమర్శలు రావడంతో తిరిగి సర్వే చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించడం జరిగిందని తెలిపారు. దీంతోపాటు పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు పరిధిలోని సర్వేనెంబర్ 620లో మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి తో పాటు బలహీన వర్గాలకు చెందిన పది ఎకరాల సీలింగ్ పట్టా భూమిని ఎఫ్ టి ఎల్ లో చూపిస్తూ అప్పటి సర్వే బృందం రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. ఈ అంశంలోనూ తిరిగి సర్వే చేయాలని ప్రభుత్వానికి అప్పీలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ప్రతి రోజు ప్రతిక్షణం ప్రజల్లో తిరుగుతూ ప్రజల సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పని చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికి కోసం ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అసైన్మెంట్ భూములను కొనుగోలు చేస్తూ క్రయ విక్రయాలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే జైపాల్ సైతం బిఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.ఆధారాలతో ఆరోపణలు చేస్తే సమాధానాలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ తమ సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…