_రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెరాస
_కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం
మనవార్తలు ,పటాన్ చెరు:
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పెద్దింటి వెంకటేష్ టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్త. ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ దుర్మరణం పాలయ్యాడు. అంతకుముందే వెంకటేష్ భార్య సైతం మృతి చెందడంతో కుటుంబం అనాధగా మారింది. ఒక కొడుకు, ఇద్దరు కూతుర్ల పోషణ భారంగా మారింది.ఇటీవల వెంకటేష్ కూతురు వివాహం కుదరడంతో, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబ పరిస్థితిని ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జీఎంఆర్, రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
ఈ మేరకు శనివారం ఉదయం స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ తనయుడు గూడెం విక్రమ్ రెడ్డిలు వెంకటేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. గతంలోనూ టిఆర్ఎస్ పార్టీ అందించిన ప్రమాద బీమా ద్వారా రెండు లక్షల రూపాయలను అందించడం జరిగింది.టిఆర్ఎస్ పార్టీకి వెన్నెముకలైన కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలుస్తున్నారని సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు రాజు, హరి ప్రసాద్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, మన్నె రాజు, పంచాయతీ వార్డు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సిహెచ్ శంకర్, కంచరి శ్రీనివాస్, గడ్డ ఎల్లయ్య, నాయకోటి నాగరాజు, డి వెంకటేష్ , నాయకోటి సంతోష్ , ప్రభు, వడ్డే అనంతయ్య ,వడ్డే సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…