Telangana

కన్నుల పండువగా గీతం పదమూడో స్నాతకోత్సవం…

– గీతం పట్టభద్రులకు సీసీఎంబీ డెరైక్టర్ సూచన

– శాంతా సిన్హా , అంపశయ్య నవీన్లకు గౌరవ డాక్టరేట్లు

– 38 మంది పరిశోధక విద్యార్థులు , దాదాపు 1,346 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం

– అత్యుత్తమ ప్రతిభ చాటిన 18 మందికి బంగారు పతకాలు

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

ప‌టాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 13 వ స్నాతకోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు . గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ , కులపతి డాక్టర్ వీరేందర్ సింగ్ చౌహాన్లు పాల్గొన్న ఈ స్నాతకోత్సవానికి సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్ కె.నందికూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హాతో పాటు ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్లకు డాక్టర్ ఆఫ్ లెటర్స్న ప్రదానం చేశారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నుంచి 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , సెన్స్ , ఫార్మశీ , హ్యుమానిటీస్ కోర్సులు పూర్తిచేసిన దాదాపు 1,346 మంది పట్టభద్రులకు డిగ్రీలను , 18 మంది ప్రతిభావంతులకు బంగారు పతకాలను అందజేశారు .

38 మంది రీసెర్చి స్కాలర్లకు పీహెచీ డిగ్రీలను ప్రదానం చేశారు . ఎంఏలో ఆరుగురు , ఎంబీఏ -65 , ఎస్సీ -55 , ఎంటెక్ -26 , బీఏ -39 , బీబీఏ -184 , బీకాం -36 , బీఫార్మశీ -30 , బీఎస్సీ -118 , బీటెక్ -787 మంది పట్టభద్రులయ్యారు . ఈసీఈ విభాగంతో పాటు బీటెక్ టాపర్గా నిలిచిన నక్కా నవ్యశ్రీ గీతం అధ్యక్షుడి పేరిట నెలకొల్పిన రెండు బంగారు పతకాలను అందుకోగా , పీజీ విద్యార్థిని సి . రేఖా యాదవ్ , యూజీ విద్యార్థిని ఆముక్త చౌదరి గద్దె ‘ బెస్ట్ ఆల్రౌండర్ ‘ బంగారు పతకాలను పొందారు . పచ్చటి ప్రకృతి మధ్య సుందర ప్రాంగణంలో నెలకొని ఉన్న గీతం ప్రాంగణానికి వెళ్లే దారులన్నీ బ్యానర్లతో అలంకరించారు . అంతర్జాతీయ సదస్సులను తలపించేలా దారుల వెంట బారులు తీరిన రంగు రంగుల జెండాలు మరింత శోభను ఇనుమడింపజేశాయి . అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు , పూల అలంకరణలు వీనుల విందు చేశాయి .

పట్టాలను అందుకోవడానికి వచ్చిన విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో ఆవరణలో సందడి నెలకొంది . తనంత ఎదిగి ప్రయోజకులవుతున్న పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు మురిసిపోగా , పట్టాలు అందుకున్న విద్యార్థులు హిప్ హిప్ హుర్రే నినాదాలతో తమ హర్షధ్వానాలను వ్యక్తపరిచారు . తల్లిదండ్రుల ఆత్మీయ ఆలింగనాలు , మిత్రులను హృదయానికి హత్తుకుపోవడం వంటి దృశ్యాలు వాతావరణాన్ని ఆహ్లాదకరం చేశాయి . పట్టభద్రులంతా తెల్లని దుస్తులు , ఎర్రని కండువాలతో వచ్చి భారతీయను వ్యక్తపరిచారు . దీనితో ప్రాంగణమంతా దవళవర్ణ శోభితంగా మారింది . బంగారు పతక విజేతలు , పట్టభద్రులు పలువురు గీతమ్ తమకున్న అనుబంధం , అక్కడ ఎదిగిన తీరు , విద్యనభ్యసించేటప్పటి పలు మథుర స్మృతులను నెమరువేసుకున్నారు . మొత్తంగా పండుగ వాతావరణంలో గీతం 13 వ స్నాతకోత్సవం విజయవంతంగా ముగిసింది .

ఈ 13 వ స్నాతకోత్సవంలో గీతం కులపతి డాక్టర్ వీరేందర్ సింగ్ చౌహాన్ , ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్దవటం , గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు , గీతం వైద్య కళాశాల ప్రోవీసీ డాక్టర్ గీతాంజలి బత్మనాబానే , గీతం బెంగళూరు ప్రొవీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.మోహన్కుమార్ , రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖర్ , డీన్లు ప్రొఫెసర్ అమిత్ భద్రా , సయ్యద్ అక్బరుద్దీన్ , ప్రొఫెసర్ పి.రామారావు , ప్రొఫెసర్ సి.విజయశేఖర్ , గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ , రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago