భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని
పటాన్ చెరు నుండి బీరంగూడ కమాన్ వరకు బైక్ ర్యాలీ
మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు
భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడంతో పాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి బీరంగూడ కమాన్ వరకు తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కారాములు మాట్లాడుతూ భగత్ సింగ్ తన 23 సంవత్సరాల కాలంలోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన దీరుడని గుర్తు చేశారు. 1907 సంవత్సరంలో జన్మించి, 1931 మార్చి 23న ఉరి తీయబడ్డాడన్నారు. అప్పట్లో మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి బ్రిటిష్ వాడు వచ్చి, మన దేశాన్ని పరిపాలిస్తున్న క్రమంలో తన చిన్నతనంలోనే బ్రిటిష్ వాడు చేస్తున్న పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడాడని గుర్తు చేశారు. ప్రజా భద్రత చట్టం, పారిశ్రామిక వ్యవహారాల చట్టాలు రెండు ఆనాడు ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి వచ్చాయని, వాటికి నిరసనగా భగత్ సింగ్ పార్లమెంటులో పొగబాంబు విసిరాడన్నారు. పొగ బాంబు వేసాక తమ భావాలను ప్రజానీకానికి చెప్పడం కోసం, ఇంక్వి లాబ్ జిందాబాద్ అన్న నినాదంతో దొరికిపోయాడని చెప్పారు.
పార్లమెంటులో భారత ప్రజానీకం ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకూడదని ఉద్దేశంతోనే పొగ బాంబు వేశాడని, భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవ్ ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడినారాని దేశ స్వాతంత్ర పోరాటం జరుగుతున్న కాలంలో బ్రిటిష్ వారు అప్పటికే హిందువులు, మైనార్టీల పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేసే చర్యలకు బ్రిటిష్ ప్రభుత్వం పాల్పడిందని, భగత్ సింగ్ వీటిని వ్యతిరేకించాడన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మతాల, కులాల మధ్యన చిచ్చు పెడుతూ తమ పబ్భాన్ని గడుపు కొంటున్నారని విమర్శించారు. ఇప్పటికే ప్రపంచంలో అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ మారణ హోమం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. యుద్ధం విషయంలో మన దేశ ప్రధానమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ యుద్ధంలో దాదాపు వేల మందికి పైగా సామాన్య ప్రజానీకం చనిపోయారని అంటే యుద్ధం యొక్క తీవ్రత ఎలా ఉందో ప్రజానీకం, మేధావి వర్గం ఆలోచించాలన్నారు.
ఇరాన్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ లోని పాఠశాలపై బాంబులు విసరడంతో దాదాపు 1,000 మందికిపైగా విద్యార్థులు మృతి చెందడం పై ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉందన్నారు, ఆదాని,అంబానీల కోసమే మన దేశ ప్రధానమంత్రి పని చేస్తున్నారని, యుద్ధము జరుగుతున్న క్రమంలో యుద్ధనౌకలు విన్యాసాలు జరుగుతుంటే విశాఖపట్నం యుద్ధనౌకను మన దేశ సైనికులు కాపాడకుండా, శ్రీలంక యుద్ధనౌకను కాపాడి 100 మందిని రక్షించిందంటే, మన దేశం యొక్క విదేశాంగ విధానం ఎలా ఉందో దీనిని బట్టి అ ర్థమవుతుందని అన్నారు, మన దేశ విదేశాంగ విధానంలో అమెరికా తలదూర్చడడం ఏంటని ప్రశ్నించారు, మన దేశానికి గతంలో ఇరాన్ నుంచి పెట్రోలు, డీజిల్, గ్యాస్ సరఫరా అయ్యేదని, ప్రస్తుతం అమెరికా ఏది చెప్తే ట్రంప్ కనుసన్నల్లోనే మన దేశ ప్రధానమంత్రి నడుస్తున్నాడని విమర్శించారు.
ఆనాడు భగత్ సింగ్ కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినాడని, భగత్ సింగ్ ఆశించిన ఆశయాలు కనుగుణంగా పోరాడాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అందుకోసం ఎర్రజెండా నాయకత్వంలో ప్రజా ఉద్యమాలను మరింతగా బలపరచాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య ఏ మాణిక్యం, సిపిఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు, ఎండి వాజిద్ అలీ, పి పాండురంగారెడ్డి, బి పెంటయ్య, జి జార్జ్,బి. అర్జున్ సత్తిబాబు ఎస్ సురేష్ కుమార్, జే పోచయ్య, జయరాం, కరెంట్ రాములు,యాక రామచంద్రమూర్తి, సురేష్, కోనయ్య గారి వెంకటరామిరెడ్డి, నరసింహారెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : ఎన్ఎంజి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్…
– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo - బీఆర్‌ఎస్! మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : తమ పై ఎన్ని కేసులు పెట్టి…
భద్రతే మొదటి ప్రాధాన్యం అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు ప్రతి పనిదినం భద్రతతోనే…