Telangana

కేసులు పెట్టి భయపెట్టాలనే కుట్రలు

– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo – బీఆర్‌ఎస్!

మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి :

తమ పై ఎన్ని కేసులు పెట్టి భయపెట్టాలనే కుట్రలు చేసినా తాము భయపడమని, చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు.ఇటీవల శేరిలింగంపల్లి బి ఆర్ ఎస్ నాయకులు మారబోయిన రవి యాదవ్ కు మియాపూర్ పోలీసు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రోజు పోలీస్ స్టేషన్ కు రవి యాదవ్ హాజరై, తనపై నమోదు చేసిన అసత్య, అక్రమ కేసుకు సంబంధించి జారీ చేసిన నోటీసుకు సమాధానంగా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు రవి యాదవ్ అన్నారు. రా సందర్భంగా బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ సభ్యులు అడ్వకేట్ లక్ష్మణ్ తో కలిసి మియాపూర్ సీఐకి అధికారిక రిప్లై లెటర్ సమర్పించారు. ఎమ్మెల్యే అరికాపూడి గాంధీ అనుచరులు నమోదు చేసిన తప్పుడు కేసును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను పోలీసులకు సమర్పించించరనీ తెలిపారు.

ఈ సందర్భంగా రవి యాదవ్ ధీటుగా స్పందిస్తూ

“ప్రజల సమస్యలు లేవనెత్తితే కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందనీ,ఒక్క కేసు పెడితే భయపడతామనుకుంటే అది వారి అజ్ఞానమే అని అన్నారు.తాము భయపడే వాళ్లం కాదనీ, చట్టపరంగా కూడా, ప్రజల మధ్య కూడా పోరాటం కొనసాగుతుంన్నారు.ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.రవి యాదవ్ కు అండగా నిలుస్తూ శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మద్దతు పలికారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శుభురాజ్, వాలా హరీష్ రావు, ఎర్రబెల్లి సతీష్, మాజీ కార్పొరేటర్, నవతా రెడ్డి, గోపురాజు శ్రీనివాస్, రామకిషన్ గౌడ్, రోజా, కలిదిండి, బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్,, విజయ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్. కార్తికేయ, అలావుద్దీన్ పటేల్, సురేష్ యాదవ్, శ్రీకాంత్, సంగారెడ్డి, షేక్ జమీర్, శివరాజ్ ముదిరాజ్, మల్లేష్, గణేష్ రెడ్డి, మజిత్, సంతోష్ నాయుడు, ముజీబ్, శ్రీనివాస్ రావ్ తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago