లక్ష్మీ మంచు యొక్క టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ
షోస్టాపర్‌గా షో కు నూతనోత్సాహం తీసుకువచ్చిన రియా చక్రవర్తి
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
ఒక మహోన్నత కార్యక్రమం కోసం ఫ్యాషన్ అంటూ గత కొన్నేళ్లుగా నిధుల సేకరణ కార్యక్రమం కోసం వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను ఒకేదరికి తీసుకువచ్చి లక్ష్మీ మంచు నిర్వహిస్తోన్న టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ- 2025 కార్యక్రమం నేడు జరిగింది. మెరుగైన విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యం తో కృషి చేస్తోన్న టీచ్ ఫర్ చేంజ్ , పేద పిల్లలకు అభ్యాస అవకాశాలను మార్చడంలో ముందంజలో ఉంది. ఈ సంవత్సరం మరింత పెద్ద ప్రభావాన్ని చూపడానికి ఇది సిద్దమైనది. తమ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ లో ఉత్సాహంగా జరిగింది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి షోస్టాపర్‌గా రన్‌వే కు కొత్త సొబగులద్దారు.ఈ సంవత్సరం ఫ్యాషన్ షోకేస్‌లో ప్రఖ్యాత డిజైనర్ స్వాతి వెల్దండి రూపొందించిన అద్భుతమైన కలెక్షన్ ను ప్రదర్శించారు. ఆభరణం నుండి అద్భుతమైన ఆభరణాలు కూడా ఈ షో లో భాగంగా ప్రదర్శించారు. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా , ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను పెంపొందించాలనే లక్ష్యంతో సినిమా, క్రీడలు మరియు ఫ్యాషన్ రంగాలలోని ప్రముఖ వ్యక్తులు రన్‌వే పై నడిచారు.అనంతరం నటి లక్ష్మీ మంచు మాట్లాడుతూ, “టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ఫ్యాషన్ కార్యక్రమం కంటే ఎక్కువ ఇది విద్య ద్వారా జీవితాలను మార్చడానికి కృషి చేసే ఉద్యమం. రియా చక్రవర్తి, స్వాతి వెల్దండి, ఆభరణం తో పాటుగా పరిశ్రమ భాగస్వాములందరి నుండి లభించిన అద్భుతమైన మద్దతు పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. వారి దాతృత్వం, ఓ మహోన్నత కారణం కోసం చూపుతున్న నిబద్ధత అత్యంత అవసరమైన పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలను అందించాలనే మా లక్ష్యానికి తోడ్పడతాయి అని అన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…