Hyderabad

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేర‌నున్న‌ ఎల్.ర‌మ‌ణ…

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేర‌నున్న‌ ఎల్.ర‌మ‌ణ…
-16న హుజూరాబాద్ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా
-ఇటీవలే కేసీఆర్ ను కలిసిన అనంతరం టీడీపీకి రాజీనామా

హైదరాబాద్:

టీడీపీ తెలంగాణ‌ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన ఎల్.రమణ ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదాగా వెళ్లి ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయ‌న‌కు స‌భ్య‌త్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు టీఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు.

కేసీఆర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తోపాటు వెళ్లి కలిశారు . ఆ సందరభంగా ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానించడం , ఆయన అందుకు సమ్మతి తెలపడం జరిగిపోయాయి.

ఎల్‌.ర‌మ‌ణ‌తో పాటు ప‌లు సంఘాల నేత‌లు, ఆయ‌న‌ మ‌ద్ద‌తుదారులు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. పార్టీ మార‌డంపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవ‌ల‌ ర‌మ‌ణ చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ ఆ పార్టీలో త‌న ప్ర‌స్థానాన్ని ముగించారు.
కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరినప్పటికీ ఈనెల 16న హుజూరాబాద్ లో జరిగే ముఖ్యమంత్రి సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు. రమణతోపాటు మరికొందరు ,టీడీపీ నేతలు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది.

రమణ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తొలుత ఈ వార్తలను ఖండించిన ఆయన గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. తన ఎదుగుదలకు 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు అందులో హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Venu

Recent Posts

వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 15 ఏళ్ల ప్రస్థానం

5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…

4 hours ago

డీజెఎఫ్ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

4 hours ago

వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…

7 hours ago

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…

7 hours ago

ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…

8 hours ago

అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…

1 day ago