Hyderabad

బిర్యానీలో మసాలా తక్కువైందని కేటీఆర్ కి ట్విట్…

బిర్యానీలో మసాలా తక్కువైందని కేటీఆర్ కి ట్విట్…
-అందుకు నేనే చేయగలను బ్రదర్ అంటూ కేటీఆర్ రిప్లయ్
-జొమాటోకు బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి
-ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ కోరానన్న వ్యక్తి
-అవేవీ లేకుండా బిర్యానీ డెలివరీ ఇచ్చారని ఫిర్యాదు

హైదరాబాద్:

నెటిజన్ లకుకూడా ఏది ట్విట్ చేయాలో ఏది చేయకూడదో తెలియకుండా ఏదిపడితే అది ట్విట్ చేసి అసలు ఉద్దేశాన్ని దెబ్బతిస్తున్నారు కొందరు నెటిజన్లు .లాంటిదే తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఒక నెటిజన్ చేసిన ట్విట్ ఆశక్తిగా మారింది. ఆయనకూడా ఆ నెటిజన్ ట్విట్ కు విస్మయానికి గురైయ్యారు.
సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయం కోరుతూ తనను ట్యాగ్ చేసిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా బదులిచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏదైనా కష్టం వచ్చి కేటీఆర్ ను సంప్రదిస్తే ఫర్వాలేదు కానీ, బిర్యానీలో మసాలా తక్కువైందంటూ ఓ నెటిజన్ తనను ట్యాగ్ చేయడంతో ఆయన విస్మయానికి గురయ్యారు.

తోటకూరి రఘుపతి అనే వ్యక్తి తాను జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారని తెలిపాడు. ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ తో బిర్యానీ కావాలని తాను ఆర్డర్ చేస్తే, అవేవీ లేకుండానే తనకు చికెన్ బిర్యానీ డెలివరీ ఇచ్చారి ఆ వ్యక్తి వాపోయాడు. జొమాటో వాళ్లు ప్రజలకు ఇలాగేనా సేవ చేసేది? అంటూ ఆ వ్యక్తి మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. దీనికి నన్నెందుకు ట్యాగ్ చేయడం బ్రదర్? ఈ విషయంలో నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అని ప్రశ్నించారు. నెట్టింట ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వేల సంఖ్యలో లైకులు, వందల సంఖ్యలో రీట్వీట్లు వస్తున్నాయి.

అన్నింటికీ మించి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ట్వీట్ పట్ల వ్యాఖ్యానించారు. తన కార్యాలయం వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ స్పందించాల్సిందేనని ఒవైసీ చమత్కరించారు.

Venu

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

9 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

11 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago