Districts

తెలంగాణ ఉద్యమానికి ఆదిగురువు కొండా లక్ష్మణ్ బాపూజీ

నేటి తరానికి ఆదర్శప్రాయుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు

తెలంగాణ ఉద్యమానికి ఆది గురువైన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేయనున్న బాపూజీ కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణకు, ప్రజాసేవకే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి బాపూజీ అన్నారు.

ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో శాసన సభ్యుడిగా పని చేయడంతో పాటు మలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని బాపూజీ నివాసమైన జలదృశ్యం నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. అంతటి మహనీయుని కాంస్య విగ్రహాన్ని తన సొంత నిధులచే పటాన్చెరులో ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ పటాన్చెరులో బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు.

శాసనసభ్యుడిగా, న్యాయవాదిగా ఉద్యమకారుడిగా, మానవతా వాదిగా బాపూజీ సమాజానికి చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, నగేష్ యాదవ్, వెంకటేష్ గౌడ్, గూడెం మధుసూదన్ రెడ్డి, పరమేష్, రాజేష్, గోవింద్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పద్మశాలి సంఘం ప్రతినిధులు రాజ మల్లయ్య, రమేష్, కంకర శీను, యాదగిరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago