Telangana

పటాన్ చెరులో అంబరాన్ని అంటిన కేసరి లాల్ యాదవ్ సంగీత విభావరి

_జనసంద్రంగా మైత్రి క్రీడా మైదానం

_తరలివచ్చిన ఉత్తర భారతీయులు

_ప్రతి ఒక్కరిని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాం..

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్చెరు పట్టణం జనసంద్రంగా మారింది. వేలాది మంది ఉత్తర భారతీయులు తమ పవిత్రమైన ఛట్ పూజ పురస్కరించుకొని.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైత్రి మైదానంలో నిర్వహించిన భోజ్ పూరి నటుడు కేసరి లాల్ యాదవ్ సంగీత విభావరి అందరిని ఉర్రూతలూగించింది.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాశ మైలారం, రామచంద్రాపురం, బొల్లారం, పటాన్చెరు తదితర పారిశ్రామిక వాడలతోపాటు ఆయా పట్టణాల్లో నివసిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ఝార్ఖండ్ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరాంచల్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ అభిమాన నటుడి ప్రత్యక్ష సంగీత విభావరిని తిలకించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వేల సంఖ్యలో తరలివచ్చారు.ఇందుకు అనుగుణంగా ఎమ్మెల్యే జిఎంఆర్ నిత్వంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహించిన సంగీత విభావరి అందరినీ ఉర్రూతలూగించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారి ఒకే వేదిక దగ్గర వేలాదిమంది ఉత్తర భారతీయులతో సమావేశం ఏర్పాటు చేయడం తన జీవితంలో ఇది ఒక మరిచిపోలేని అనుభూతి అన్నారు. ఉన్న ఊరిని విడిచిపెట్టి.. పొట్టకూటి కోసం పటాన్చెరు నియోజకవర్గానికి తరలివచ్చిన ప్రతి ఉత్తర భారతీయుడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు.ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తక్షణమే అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు.భవిష్యత్తులోనూ ఇదే విధంగా తమకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ది రియల్ లీడర్ ఎమ్మెల్యే జిఎంఆర్..
నటుడు, గాయకుడు కేసరి లాల్ యాదవ్

తన నట జీవితంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో పటాన్చెరులో సంగీత విభావరిలో పాల్గొన్నానని తెలిపారు. విమానాశ్రయం నుండి వేదిక వరకు అడుగడుగునా ఘన స్వాగతం పలకడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందన్నారు.ఎమ్మెల్యే జిఎంఆర్ తన సొంత కొడుకు వలె ఆప్యాయంగా పలకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇచ్చిన ఆతిథ్యం మరిచిపోలేని జ్ఞాపకం అన్నారు.ఛట్ పూజా సందర్భంగా వేలాదిమంది ఉత్తర భారతీయులతో కలిసి తన సంగీత విభావరి ఏర్పాటు చేయడం అద్భుతం అన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకొని, కృతజ్ఞత తెలుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కేసరి లాల్ యాదవ్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago