politics

దేశంలోనే విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దేశ్ కీ నేతగా, దేశ రాజకీయాల్లో కీలక ఘట్టాన్ని రూపొందించబోయే మహా నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ,పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో  కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ
కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు బీఆర్ఎస్ గా మారాక దేశప్రజలందరూ కేసీఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతుభీమా, రైతుబంధు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి 24 గంటలు కరెంట్ వంటి పథకాలు దేశంలో అమలయ్యేలా చూస్తున్న మహా నాయకుడని అన్నారు. కాళేశ్వరం నీటితో వందల ఎకరాలు సస్యశ్యామలం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి ది అని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క యువత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని అన్నారు దేశానికి ఏం చేస్తారని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన లో ఎన్నో కష్టాలు కోర్చి ప్రత్యేక తెలంగాణ సాధించారన్నారు. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఆశీర్వదిస్తారని ఆయన తెలిపారు. అనంతరం ఎన్ఎమ్అర్ యువసేన ఆధ్వర్యంలో రక్తదానశిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పొట్టి నారాయణ రెడ్డి,వెంకటేష్,మురళీ, రాజ్ కుమార్,వెంకటేశ్, ఎండీ ఖదీర్, గారెల మల్లేష్, నారబోయిన శీను, సత్య నారాయణ, మన్నేరాములు,గోపాల్,మహేష్,భాస్కర్, శ్రీనివాస్, రాఘవేంద్ర, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago