_క్రైస్తవుల సంక్షేమానికి 10 లక్షల రూపాయల విరాళం
_భారీ సంఖ్యలో హాజరైన క్రిస్టియన్లు
_కళాకారులకు 50 వేల రూపాయలు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని, ఎందుకనగా పటాన్చెరు నియోజకవర్గంలోని క్రైస్తవుల సంక్షేమం కోసం పది లక్షల రూపాయల స్వంత నిధులను అందజేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో గురువారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగ జరిగాయి. వేలాదిమంది క్రైస్తవులు తమ కుటుంబ సభ్యులతో కార్యక్రమానికి హాజరై యేసుక్రీస్తు కొనియాడుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల మూలంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని క్రైస్తవుల కోసం రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో క్రైస్తవ భవన్ నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వంతో చర్చించి అతి త్వరలో స్మశాన వాటిక కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం చర్చిలకు అందించే నిధులతో పాటు తాను సొంతంగా 10 లక్షల రూపాయలు అందిస్తున్నానని ప్రకటించారు. వీటితో నిరుపేద క్రిస్టియన్ల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రిస్టియన్ల కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దీంతోపాటు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
వేడుకల సందర్భంగా కళాబృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందని అలరించాయి. వీరిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే జిఎంఆర్ 50వేల రూపాయలు బహుమతిగా అందించారు.అనునిత్యం కంటికి రెప్పలా కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ కు వెన్నంటి నిలుస్తామని క్రైస్తవులు తెలిపారు.అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, దేవానందం, జడ్పీటీసీలు సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాల్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్. ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, అఫ్జల్, షేక్ హుస్సేన్, ఈర్ల రాజు, సీనియర్ నాయకులు, పాస్టర్ల సంఘం అధ్యక్షులు ప్రశాంత్, కార్యకర్తలు, వివిధ చర్చిల పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…