పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో అత్యాధునికంగా నిర్మించిన అవుట్డో డోర్ క్రీడా సదుపాయాలు , పునరుద్ధరించిన ఇండోర్ స్పోర్ట్స్ ప్రాంగణాలను విద్యార్థులు , సిబ్బంది హర్షధ్వానాల మధ్య గురువారం గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ్ ప్రారంభించారు . ఈ క్రీడా సదుపాయంలో బాస్కెట్బాల్ , టెన్నిస్ కోసం సింథటిక్ యాక్రిలిక్ ఉపరితలాలతో కూడిన కోర్టులు , ఒక కృత్రిమ టర్ఫ్ మల్టీస్పోర్ట్ కోర్టు , బీచ్ వాలీబాల్ కోర్టులున్నాయి . ఇండోర్ కాంప్లెక్స్లో మూడు ఇండోర్ ఎయిర్ కండిషన్డ్ బ్యాడ్మింటన్ , ఒక కబడ్డీ కోర్టుతో పాటు టేబుల్ టెన్నిస్ , చెస్ , క్యారమ్ , ఫూస్బల్ వంటి క్రీడా సదుపాయాలను ఏర్పాటు చేశారు . వీటిని ప్రారంభించాక , గీతం కార్యదర్శి ఎం . భరద్వాజ్ మాట్లాడుతూ , క్రీడలు వ్యక్తిత్వం , క్రమశిక్షణ , బృంద స్ఫూర్తి , నాయకత్వ లక్షణాలతో పాటు జీవన నైపుణ్యాలను పెంపొందిస్తాయన్నారు . అత్యాధునిక శిక్షణా సౌకర్యాల వల్ల విద్యార్థులు తప్పకుండా ప్రయోజనం పొందుతారన్న విశ్వాసం వెలిబుచ్చారు . గీతం కార్యదర్శిని స్వాగతిస్తూ , నూతన , మెరుగుపరచిన క్రీడా సౌకర్యాలు గీతం హెదరాబాద్ ప్రాంగణానికి ఎంతో ముఖ్యమైనవని క్రీడల డెరైక్టర్ అరుణ్ కార్తీక్ అన్నారు .
శక్తివంతమైన , స్థిరమైన క్రీడా సంస్కృతిని నిర్మించాలన్న గీతం దూరదృష్టికి ఇవి దోహదపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు . విస్తృత శ్రేణి క్రీడా శిక్షణ కార్యక్రమాలు , క్రీడా కోర్సులు , సాధారణ పోటీలు , వినోద కార్యక్రమాలను నిర్వహించడానికి క్రీడా సిబ్బంది , శిక్షకులకు ఈ సదుపాయాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు . సురక్షితమైన ఆట , ఆరోగ్యకరమైన పోటీ , మెరుగైన సౌకర్యాలు కీలకపాత్ర పోషిస్తాయని , తద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తోడ్పడగలవని డెరైక్టర్ అభిప్రాయపడ్డారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , పలువురు డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు .
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…
సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…
ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…
ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .…