మనవార్తలు ,శేరిలింగంపల్లి :
ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఎప్పటి లాగే బీహెచ్ ఈ ఎల్ జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. పెరుగుతున్న పోటీని తట్టుకుంటు, వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబోధన చేస్తూ అధ్యాపక బృందం విద్యార్థులను చక్కటి మార్గంలో నడిపిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నది జ్యోతి విద్యాలయ హై స్కూల్. సి బి ఎస్ సి సిలబస్ తో, విశాలమైన ప్లే గ్రౌండ్ తో విద్యార్థులకు అన్ని రకాల క్రీడల్లోనూ శిక్షణనిస్తున్నారు. చదువుతో పాటు వివిధ రకాల క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించారు. ప్రతీ సంవత్సరం పదోతరగతి ఫలితాల్లో తిరుగులేని విజయడంఖా మోవిస్తూ దూసుకుపోతుంది. ఈ సంవత్సరం మొత్తం 84 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా అందులో జి. జయస్వీ, బశిరత్ ఉన్నిసా లు 10 జిపిఏ సాధించారు. నలుగురు విద్యార్థులు 9.8, ముగ్గురు 9.7, ఐదుగురు 9.5, ముగ్గురు 9.2, నలుగురు 9.0 జిపిఏ సాధించి విజయడంఖా మోగించారు. అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు అన్నట్లు విజయం సాధించారు. ఇదే ఉత్సాహం తో ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తామని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…