– బాస్కెట్ బాల్ కోర్ట్ ప్రారంభం.
– క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి శ్రీకారం
విద్యతో పాటు. విభిన్న క్రీడల్లో , ఇతర రంగాల్లోను విద్యార్థులను తీర్చిదిద్దడానికి బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ సీ బీ ఎస్ సి హై స్కూల్ శ్రీకారం చుట్టిందని, అందుకు. కొందరు పూర్వ విద్యార్థులు చక్కటి తోడ్పాటును అందిస్తున్నారని స్కూల్ ఫాదర్,కరస్పాండెంట్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ లు అన్నారు. పూర్వ విద్యార్థులు పూర్ణిమా రాఘవేంద్ర ల సహకారం తో నూతనంగా ఏర్పాటు చేసిన బాస్కెట్ బాల్ కోర్ట్ ను వారితో కల్సి శుక్రవారం రోజు ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ లు ప్రారంభించారు. బాస్కెట్ బాల్ కోచ్ వేణుగోపాల్, పూర్వవిద్యార్థులు, పిల్లలతో కల్సి కొద్దీ సేపు బాస్కెట్ బాల్ ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం చదువే కాకుండా పిల్లలను. క్రీడలు, సాంస్కృతిక, కళా నైపుణ్యాలు వంటి అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి తమ సిబ్బంది ఎల్లప్పుడూ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
చుట్టుపక్కల ఎక్కడాలేని విదంగా తమ సువీశాలమైన ప్రాంగణంలో అన్నిరకాల క్రీడలకు శిక్షణనిచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సిద్ధం చేస్తామన్నారు. ఇదే స్కూల్ విద్యార్థులయినా బీచ్ వాలీబాల్ ఇండియన్ టీమ్ క్యాప్టెన్ రామకృష్ణ రాజు మరియు పూర్వ విద్యార్థుల సహకారం తో వాలీబాల్ కోర్ట్ ను కూడా ఇటీవలే ఆధునికరించినట్లు తెలిపారు. అనంతరం దశల వారిగా క్రికెట్, ఇండోర్, ఔట్ డోర్, అథ్లెటిక్ ఇలా అన్నిరకాల క్రీడలను నేర్పించేందుకు మల్టిలేవల్ స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామన్నారు. జ్యోతి విద్యాలయ హై స్కూల్ దినదినాభివృద్ధి చెందుతుందని, అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నింటిని సమకూరుస్తున్నామని, ప్రతీ రోజు 4.30 నుండి 5.30 వరకు క్రీడా శిక్షణ ఇప్పిస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.
దాతలు పూర్ణిమా రాఘవేంద్ర లు మాట్లాడుతూ తాము చదువుకున్న స్కూల్ ను అభివృద్ధి చేయడానికి, విద్యార్థులను సంపూర్ణ వ్యక్తులు గా చేయడానికి, ఒత్తిడి లేని విద్యావిధానం ఉండాలనే ఉదేశ్యంతో క్రీడలపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలన్నారు. ప్రాథమిక స్కూల్ స్థాయి నుండే క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు. మార్కుల్లో 15 శాతం లేదా 20 శాతం కలిపేందుకు ప్రభుత్వo విద్యావిధానంలో మార్పులు తేవాలని సూచించారు. అపుడు భారత దేశంలో క్రీడాకారులు మరింత ప్రతిభ కనబరుస్తూ దేశ ఖ్యాతిని పెంచుతారని తెలిపారు. జ్యోతి విద్యాలయoలో నిపుణులైన బాస్కెట్ బాల్ కోచ్ లు వేణుగోపాల్, వాలీబాల్ కోచ్ బాల వీరయ్య ల సారధ్యంలో విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి తమవంతు సహాయ సాకారాలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, లక్ష్మీకాంత్, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…