Districts

గీతం అధ్యాపకుడు ఆరిఫ్ మొహమ్మద్కు డాక్టరేట్ ‘…

మనవార్తలు , పటాన్ చెరు:

రక్షిత క్లౌడ్ కంప్యూటింగ్ వాతావరణం కోసం విశ్వసనీయ కంప్యూటింగ్ టెక్నాలజీ’పై పరిశోధన , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరిఫ్ మొహమ్మద్ అబ్దుల్ను డాక్టరేట్ వరించింది . ఒరిస్సా , సంబల్పూర్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ సుదర్శన్ జేనా , హెదరాబాద్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ ప్రొఫెసర్ ఎం.బాలరాజులు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ పరిశోధనలో విశ్వసనీయత , పాత్ర – ఆధారిత ప్రవేశ నియంత్రణ ద్వారా వినియోగదారుల హానికరమైన కార్యకలాపాలను తగ్గించడంతో పాటు కంప్యూటింగ్ ఖచ్చితత్వం , సామర్థ్యాన్ని మెరుగుపరచినట్టు తెలిపారు .

తద్వారా భద్రత , సమర్థమైన కంప్యూటింగ్ను చేర్చడం ద్వారా మొబెల్ క్లౌడ్ కంప్యూటింగ్ విశ్వసనీయ వాతావరణాన్ని అమలుచేసి ప్రధాన ఫలితాలను సాధించామన్నారు . పట్టా ఆరిఫ్ మొహమ్మద్ అబ్దుల్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం జెఎన్టీయూ హైదరాబాద్ నుంచి పీహెచ్ సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago