Telangana

బిజెపి నుండి బిఆరెస్ లోకి చేరికలు

– గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రవి యాదవ్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బిజెపి చేస్తున్న మత విద్వేషాలు రెచ్చ గొట్టే విధానాలు నచ్చక చాలా మంది సీనియర్ నాయకులు, యువకులు బిఆరెస్ పార్టీ లో చేరుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ బిఆరెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిఆరెస్ పార్టీ కి పూర్వవైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తo చేశారు. ఆదివారం రోజు శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ కు చెందిన బిజెపి నాయకులు వాకిటి శంకర్, టి. చంద్ర ల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో సీనియర్ నాయకులు, యువకులు బిజెపి పార్టీ నీ వీడి బిఆరెస్ లో చేరగా వారికీ రవి యాదవ్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు అనాలోచిత నిర్ణయం తొ ప్రజలు తొందర పడి కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేశామని పశ్చాతాప పడుతున్నారని, మళ్ళీ బిఆరెస్ పార్టీ చేసిన అభివృద్ధి నీ చూసి పార్టీ లోకి వస్తున్నారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిఆరెస్ పార్టీ కి పూర్వవైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తo చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కే. ఎన్. రాములు, ప్రభాకర్ గౌడ్, డాక్టర్ రవికుమార్, స్వామి, శ్రీను, వెంకట్ చారి, సురేష్, కొండాకల్ శ్రీను, చింతల శ్రీకాంత్ యాదవ్, పంతం సురేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, సాయినందన్ ముదిరాజ్,మల్లేష్ గౌడ్, గడ్డ మహేష్, పవన్, సత్యనారాయణ గౌడ్, బబ్లు, విశాల్, పూర్ణ, మనోజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

6 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

6 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

6 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago