పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి…
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో చైర్మన్ తో పాటు సభ్యుల పేర్లను ప్రకటించారు. చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి .జనార్దన్ రెడ్డిని నియమించారు. మిగతా సభ్యులను కూడా ప్రకటించారు. టి ఎం జి ఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కి కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించటం విశేషం . తెలంగాణ రాష్ట్రంలో లక్ష 93 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఇప్పటికే నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది . పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు యువత లో ఆశలు చిగురింప చేసింది . అందులో కమిషన్ చైర్మన్ గా ఐఏఎస్ ను నియమించటం పై కూడా సానుకూల వ్యాఖ్యానాలే వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం సత్వర చర్యలు తీసుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి .
సభ్యుల వివరాలు …..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్, సభ్యులను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్…టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి డాక్టర్. బి. జనార్ధన్ రెడ్డి,టీఎస్ పీఎస్సీ సభ్యులుగా మరో ఏడుగురు నియామకం సభ్యులుగా రామావత్ ధన్ సింగ్,బి.లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి,డా.ఆరవెళ్లి చంద్రశేఖర్రావు,ఆర్.సత్యనారాయణ,కారం రవీందర్ రెడ్డి,సుమిత్రా ఆనంద్.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…