Telangana

సమిష్టి సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా ఇస్నాపూర్

ఇస్నాపూర్ మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు సంక్షేమ.. పథకాలు

పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నూతనంగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీని ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులతో కలిసి రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం వార్డు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ సుమలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన పురపాలిక తొలి పాలకవర్గ సమావేశానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో నూతనంగా 5 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మున్సిపల్ సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రతి వార్డు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వీటిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి వార్డుని అభివృద్ధి పతంలో ముందుకు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవి రెడ్డి, కమిషనర్ వెంకట కిషన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

15 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

15 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

15 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

15 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago