Telangana

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎం.అనూషకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని ఎం.అనూషను డాక్టరేట్ వరించింది. ‘బయోలాజికల్ మ్యాట్రిక్స్ లో ఎంచుకున్న ఔషధాల అంచనా కోసం ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్ పద్ధతుల అభివృద్ధి, ధ్రువీకరణ’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంరెడ్డి గొడెల మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.అనూష పరిశోధన, మానవ ప్లాస్మాలో క్యాన్సర్ నిరోధక ఔషధాలైన అస్కిమినిబ్, ఫ్రక్విన్టినిబ్, లుర్బినెక్టెడిన్ లను లెక్కించడానికి సున్నితమైన ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్ పద్ధతులను అభివృద్ధి చేసి ధృవీకరించినట్టు తెలియజేశారు. ధృవీకరించబడిన పద్ధతులు అద్భుతమైన ఖచ్చితత్వం, ఖచ్చితత్వంతో పాటు స్థిరత్వాన్ని చూపించాయన్నారు. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండడంతో పాటు, ఫార్మకోకైనెటిక్, జీవ లభ్యత, క్లినికల్ అధ్యయనాలకు అనుకూలతను ప్రదర్శించాయని వివరించారు.అనూష సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.శివకుమార్, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago