Telangana

జూన్ 21న పటాన్చెరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం

మైత్రి మైదానంలో భారీ ఏర్పాట్లు 

భారీ సంఖ్యలో హాజరుకానున్న విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు, అధికారులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 21వ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుండి 9 గంటల వరకు పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో భారీ స్థాయిలో యోగా దినోత్సవం వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో.వివిధ శాఖల అధికారులు, యోగ నిర్వహణ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మైత్రి మైదానంలో. యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగ అనే పదం పరమాత్మతో మనస్సు యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుందని తెలిపారు. యోగ దినోత్సవం లో ప్రతి ఒక్కరి పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిఐ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago