– ప్రత్యేక చొరవ తీసుకున్న ఆంజనేయులు సాగర్
మనవార్తలు ప్రతినిధి , – శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ మరియు సిద్ధిక్ నగర్ కాలనీలలో డివిజన్ నాయకుడు ఆంజనేయులు సాగర్ దాదాపు అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలను స్వయంగా దగ్గరుండి ఏర్పాటు చేయించారు.ఈ వీధి దీపాల ఏర్పాటు వల్ల రాత్రి సమయంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఎలాంటి భయాందోళనలు లేకుండా సురక్షితంగా సంచరించే అవకాశం కలుగుతోందన్నారు. చీకటి కారణంగా చోటుచేసుకునే అసౌకర్యాలు, ప్రమాదాలు మరియు అవాంఛనీయ ఘటనలను నివారించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.అంజయ్య నగర్ డివిజన్‌లో కొన్ని ప్రాంతాల్లో వెలుగుల కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి, ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. కాలనీల్లో భద్రతా వాతావరణం ఏర్పడటంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన పరిస్థితులు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…