మనవార్తలు,పటాన్ చెరు:
గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు విడివిడిగా ఫ్రెషర్స్ పార్టీలను మంగళవారం వినూత్నంగా నిర్వహించారు . ఎంతో ఉత్సుకతతో ఫ్రెషర్స్ పార్టీ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన మేనేజ్మెంట్ , సెన్స్ విద్యార్థులు సంగీతం , ఆటలు , పాటలు , పసందైన విందులతో ఉల్లాసంగా , ఉత్సాహభరితంగా గడిపారు . కొత్త విద్యార్థులను స్నేహపూర్వక వాతావరణంలో స్వాగతించడం , వారి సృజనాత్మక ప్రేరణలను ప్రోత్సహించడం , వారిలో విశ్వాసాన్ని ఇనుమడింపజేయడం ఈ ఫ్రెసర్స్ డే ముఖ్య లక్ష్యం . డే మిరుమిట్లు గొలిపే వస్త్రధారణతో , సీతాకోక చిలుకల్లా అటూ ఇటూ కలియతిరుగుతున్న విద్యార్థులతో ప్రాంగణమంతా శోభాయమానంగా మారి , పండుగ శోభను సంతరించుకుంది .
ఇక అదిరిపోయే సాంస్కృతిక కార్యక్రమాలతో రోజంతా మనోహరంగా గడిచిపోయింది . ర్యాంప్ వాక్ , సంప్రదాయ , ఫూజన్ , పాశ్యాత్య నృత్యాలు , ఉత్తేజకరమైన గానాలకు అద్భుతమైన అలంకరణ జతకలిసి విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది . అలసిపోయే వరకు ఆడి పాడి , పసందెన విందు , అల్పాహారాలతో ఈ ఒకరోజు ఉత్సవాన్ని ఘనంగా ముగించారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…