Telangana

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

– మంత్రి వివేక్ వెంకట్ స్వామి

– మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పం

– ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచాయనిమంత్రి వివేక్ వెంకట్ స్వామి పేర్కొన్నారు. ఆదివారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్న కంజర్ల లో ఇందిరమ్మ ఇండ్ల ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  2012 లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కలను సాకారం చేసిందన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పై హామీలు ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలందరికీ సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం గొప్ప విషయమని, రాబోయే రెండేళ్లలో మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న అనంతరం వర్షాకాలంలో ఇంట్లోకి నీరు రాకుండా ప్రశాంతంగా జీవిస్తున్నామని చిన్న కంజర్ల కు చెందిన లబ్ధిదారు ఈశ్వరమ్మ తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు.ఇళ్ల పథకంతో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో ప్రభుత్వం ముందుందని తెలిపారు. అర్హులైన వారికి పెన్షన్లు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యారంగంలోనూ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు 33 జిల్లాల్లో కేంద్ర వంటశాలల ఏర్పాటుతో నాణ్యమైన, పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో సమీకృత పాఠశాలల ఏర్పాటు, ఆధునిక సౌకర్యాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించిందన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు నేర్పించి మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.పేదలు, విద్యార్థులు, యువత సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తోందని నాయకులు వివరించారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago