_అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామ చౌరస్తాలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూతన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్ అని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు, సమాన హక్కులు, పరిపాలన వికేంద్రీకరణ, చిన్న రాష్ట్రాలు, పరిపాలనలో మహిళలకు 50% రిజర్వేషన్లు, తదితర మహోన్నత నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో.. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అనంతరం పెద్ద కంజర్ల గ్రామంలో 15 లక్షల రూపాయలతో నిర్మించిన యాదవ సంఘం, చిన్న కంచర్ల గ్రామంలో 15 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి భవనం, 30 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత మురుగినీటి కాలువలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సర్పంచులు నారాయణరెడ్డి, రాజ్ కుమార్, ఎంపీటీసీ వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ హరిశంకర్ గౌడ్, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు గ్రామ పుర ప్రముఖులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…