Telangana

ఘనపూర్ గ్రామంలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం

_కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు

_వచ్చే నెలలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు, ఉచిత పరీక్ష సామాగ్రి పంపిణీ

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు ఆధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల భవనాలను నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరువు మండలం ఘనపూర్ గ్రామంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు మన ఊరు మనబడి ద్వారా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు పక్కా భవనాలను నిర్మించామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలోనూ ప్రభుత్వం మరియు సి ఎస్ ఆర్ నిధులతో పక్కా భవనాలు నిర్మించామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల మూలంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం సిఫార్సులు చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.ఘనాపూర్ గ్రామంలో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనంలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు.నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 7000 మంది విద్యార్థులకు వచ్చే నెల మొదటి వారంలో మోటివేషనల్ క్లాసులు నిర్వహించబోతున్నామని తెలిపారు. దీంతోపాటు ప్రతి విద్యార్థికి పరీక్షా కిట్లు అందించబోతున్నట్లు తెలిపారు.పాఠశాలల అభివృద్ధికి గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయించడం పట్ల సంస్థ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ విభాగం అధిపతి రఘురామన్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ విట్టలయ్య, ఎంఈఓ రాథోడ్, రాఘవేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్ నాయక్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago