విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత..
-వారంతా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్టుకు అనుసంధానించాలి
-విదేశాలకు వెళ్లాలనుకునే వారిని అనుసంధానం తప్పనిసరి
-రెండు డోసుల మధ్య విరామం తగ్గింపునకు అనుమతి
-28రోజుల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసుల తీసుకోవచ్చని స్పష్టం
హైదరాబాద్:
విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్ ఆధారిత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వ తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే తొలి డోసు తీసుకున్నవారు 28 రోజుల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది. కొవిడ్ షీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 84 రోజుల వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది.
అనుసంధాన ప్రక్రియలో వ్యాక్సిన్ రకం అనే ఆప్షన్ దగ్గర కొవిషీల్డ్ అని పెడితే సరిపోతుందని స్పష్టం చేసింది. ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోన్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ అనుమతి ఉందని స్పష్టం చేసింది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…