– మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం
_పటాన్ చెరు శ్రామిక భవన్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ – సభ
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఐసిడిఎస్ మంత్రి ఈనెల 22 న మాట్లాడిన వాక్యలను త్రీవంగా కండిస్తున్నట్లు, ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని లేదంటే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం పటాన్ చెరు శ్రామిక భవన్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం జరిగిన సభ లో రాజయ్య మాట్లాడుతు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా అన్ని పరిష్కారం చేశామని ఐసిడిఎస్ మత్రి మాట్లాడటం అత్యంత దుర్మార్గమని మంత్రే ఆగస్ట్ 18 న చర్చలు జరిపారని, నిర్దిష్టంగా కొన్నింటి పైన హామీలు ఇచ్చారని, అదే మంత్రి ఆగస్ట్ 25 న ఇచ్చిన హామీలకు బిన్నంగా, మోసం చేస్తూ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సగానికి తగ్గించి ప్రకటన చేయటం దారుణమన్నారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని కప్పి పుచ్చి, అంగన్వాడీ ఉద్యోగులు న్యాయంగా చేస్తున్న సమ్మె పైన దాడి చేయడం అత్యంత హేమమైన చర్య అన్నారు.అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని అడుగుతుంటే, ఈ అంశాన్ని పక్కన బెట్టి కేంద్రం చుట్టూ తిప్పాలని చూడటం సరైంది కాదన్నారు. కేంద్రానికి సంబంధం లేకుండా అనేక రాష్ట్రాలు, అనేక సౌకర్యాలను అంగన్వాడీ ఉద్యోగులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. అలాగే ఇక్కడ కూడా సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీ ఉద్యోగులు అడగటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఇత రాష్ట్రాల గురించి మాట్లాడే ముందు మంత్రి తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలలో అంగన్వాడీ ఉద్యోగుల పర్మినెంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.4 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్న అస్సాం గురించి,3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్న పచ్చిమ బెంగాల్ గురించి ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలన్నారు, వెల్ఫేర్ బోర్డ్ తో పాటు పెన్షన్ ఇస్తున్న కేరళ గురించి, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తున్న కర్ణాటక గురించి ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నామన్నారు.మంత్రి అనేక రాష్ట్రాల లో ఇస్తున్న వేతనాలు కూడా ఉన్నది ఉన్నట్టు కాకుండా తక్కువ చేసి చూపిస్తూ పచ్చి అబద్ధాలు ఆడటం, కేంద్రం 2018 లో వేతనాలు పెంచితే ఈ అంశాన్ని కూడా పరిగనలోకి తీసుకోకుండా పైగా ఏమీ పెంచలేదని అబద్దమాడటం మంత్రి హోదా లో ఉన్న వారికి ఇది సరైంది కాదన్నారు.పే స్కేల్ లేకుండా బేసిక్ వేతనం నిర్ణయం చేయకుండ పి ఆర్ సి లో కలిపితే మాకు న్యాయం ఎలా జరిగిందో మంత్రి చెప్పాలన్నారు.అంగన్వాడీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 4,500 లు ఇస్తున్నదని. తెలంగాణ కు ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు 1200 చెల్లించారని. ఇవి మినహాయిస్తే తెలంగాణ ప్రభుత్వం ఇచేది కేవలం 7,950 మాత్రమేనాని. దీనిని మరుగున పరిచి మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పటం సిగ్గుచేటన్నారు.
ధనిక రాష్ట్రమని చెప్తున్న ప్రభుత్వం వెనక పడ్డ రాష్ట్రాల వేతనాలతో పోల్చ కూడదన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలతో పోల్చుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న పోరాటం పట్ల తన వ్యతిరేక వైఖరిని, అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, సమ్మె లో ఉన్న సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…