Telangana

ప్రజా పాలనలో నా వంతు పాత్ర నిర్వర్తిస్తా : నీలం మధు ముదిరాజ్

_కాంగ్రెస్ లో చేరిన నీలం మధు ముదిరాజ్

_కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి  

_ఇందిరమ్మ స్పూర్తితో పాలన లో సామాన్యులకు న్యాయం..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ యువనేత, ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు యువనేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి నీలం మధును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీ భవన్ కి బయలుదేరి ముందు చిట్కుల్ లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో నీలం మధు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో వందలాది వాహనాలతో గాంధీభవన్ కు బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ సంక్షేమం అందించే దిశగా ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ హామీల అమలుకి కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ పాలన అందిస్తామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే దిశగా ముందుకు సాగుతూ ప్రజలందరికీ న్యాయం చేస్తుందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పాలనలో తాను సైతం భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ అధినాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి మరియు సహకరించిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గాంధీభవన్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డితో యువనేత నీలం మధు ముదిరాజ్ భేటీ 

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించి పూలబొకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. నీలం మధు చేరికను రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా సైనికునిగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతికి పాటుపడతామని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీకి బహుమానంగా ఇస్తామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి ,మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి , ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,రోహిన్ రెడ్డి , రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago