Telangana

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్‌పో 6వ ఎడిషన్‌ను టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్‌కు చెందిన ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్‌లోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రదర్శన ‘టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్‌పో – 6వ ఎడిషన్’ శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. జూన్ 13, 14 తేదీల్లో హాల్ నెం.3లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎక్స్‌పో కొనసాగనుంది. గృహ కొనుగోలుదారులకు ఉచిత ప్రవేశం కల్పించారు. “సహీ టైమ్, సహీ ఘర్ ఔర్ సహీ ఫ్యూచర్” అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 30కి పైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ 100కుపైగా ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నాయి. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒకే వేదికపై విభిన్న ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.ఈ ఎక్స్‌పోను ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ లోక్‌సభ సభ్యుడు శ్రీ మాధవనేని రఘునందన్ రావు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, గొప్ప వారసత్వ సంపదతో దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన మెట్రో నగరంగా ఎదిగిందని పేర్కొన్నారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి హైదరాబాద్ ఒక ప్రముఖ గమ్యస్థానంగా మారిందన్నారు.ఇటీవలి కాలంలో మెట్రో రైలు విస్తరణ, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి వంటి ప్రాజెక్టుల కారణంగా నగర మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమయ్యాయని, దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో గృహాలపై డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అలాగే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR), జాతీయ రహదారుల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రహదారి అనుసంధానం మరింత మెరుగుపడిందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా నిలుస్తోందని ఆయన వివరించారు.

క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి మాట్లాడుతూ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCలు) మరియు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అభివృద్ధికి ప్రధాన కారణమని అన్నారు. ప్రస్తుతం గృహ కొనుగోలుకు ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కె. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) అమలులోకి వచ్చిన తరువాత తెలంగాణ డెవలపర్లు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా ముందుకు సాగుతోందన్నారు.ఈ ఎక్స్‌పోకు అపర్ణ కన్స్ట్రక్షన్స్ ప్రెజెంటింగ్ స్పాన్సర్‌గా, మై హోమ్ గ్రూప్, ఎన్‌కాంటో బై లాన్సమ్ & ఎంకే రియాల్టీ పవర్డ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిగా ఉంది.హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు పెట్టుబడిదారులు మరియు రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఈ ఎక్స్‌పో ప్రత్యేక అవకాశంగా నిలవనుంది.ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి, నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కె. శ్రీధర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ & జోనల్ హెడ్ ఎం. రవీంద్ర బాబు పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

16 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

17 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

17 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

21 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

21 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

21 hours ago