మనవార్తలు ,హైదరాబాద్ :
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్ వారు 120 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంమాదాపూర్ లోని నోవొటెల్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానానికి ముఖ్యఅతిధిగా సైబరాబాద్ డీసీపీ, షీ టీమ్ ఇంచార్జ్ సి అనసూయ మరియు మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి, మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా సైబరాబాద్ డీసీపీ షీటీమ్ ఇంచార్జ్ సి.అనసూయ మాట్లాడుతూ మహిళలు సమిష్టిగా స్థాపించిన ఈ రోజు, లింగ సమానత్వం, మహిళల హక్కులపై కూడా దృష్టి పెడుతుందని మరియు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆశిస్తున్నానని అన్నారు.
మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ బ్రేక్ ద బయాస్ అనే థీమ్ తో మనం ఈ సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.దీని యొక్క ముఖ్య ఉద్దెశం పురుషులతో పాటు మహిళలు సమానులే అని గుర్తించాలని. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమంగా రాణిస్తున్నారని వాళ్ళు ఇంకా ఎన్నో మైలురాయిల్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా డాక్టర్స్ కు వారి సేవలను గుర్తించి అవార్డులను అందజేశారు.
క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ వారు ఇంత గొప్ప కార్యక్రమం వివిధ హాస్పిటల్స్ డాక్టర్స్ ని పిలిచి వారి సేవలను గుర్తించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు చాల సంతోషంగా ఉoదని. కోవిడ్ సమయంలో వైద్యుల సేవలు మనం మరువలేనివని మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందటం చాలా సంతోషంగా ఉoదని మున్ముందు ఎన్నో విజయాలను అందుకోవాలని కోరుంటున్నామని అన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…