▪️ శరత్ సిటీ మాల్‌లో కలర్‌ఫుల్ ఈవెంట్
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ కొండాపూర్ లో వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్‌కు హీరోయిన్ ధన్యబాలకృష్ణ హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ, “వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ ఒక బంగారు భరోసా లాంటిది. నాణ్యమైన ఆభరణాలతో పాటు ఈ ఛాలెంజ్ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు కస్టమర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి ఈవెంట్స్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు. ఆమె సందర్శకులతో కలిసి ఛాలెంజ్‌లో పాల్గొని, వారిని ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఛాలెంజ్‌లో విజేతలకు బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేయడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆభరణాల్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్య గోల్డ్, ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేసింది. భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…