మనవార్తలు ,శేరిలింగంపల్లి :
గచ్చిబౌలి డి. ఎల్. ఎఫ్ బిల్డింగ్ లోని సైబేజ్ సాఫ్ట్వేర్ కంపెనీ తమ కార్పొరేట్ సామజిక బాధ్యతలో భాగంగా గత సంవత్సరం సైబేజ్ కోవిద్ సంజీవని ప్రోగ్రాం ని ప్రారంభించి కరొనతో కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోయి కుటుంబ పోషణ భారంగా ఉన్న కుటుంబాలకి చేయూతని ఇవ్వడం కోసం వారి కుటుంబంలో ఉన్న పిల్లలని చదివించడం కోసం స్కూల్ ఫీజులని మరియు కొంత మంది కుటుంబాలకి 6 నెలలు ఇంటి అద్దెలు, 6 నెలలు కిరాణా సామానులు కూడా అందించడం జరిగిందిoచినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం రోజు స్కూల్ పిల్లకి స్కూల్ ఫీజు చెక్కులని మరియు స్కూల్ బ్యాగులని హైదరాబాద్ సైబేజ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డెలివరీ మామూనూరు సురేష్, డెలివరీ హెడ్స్ పుచ్చ శర్మ, రవి శర్మ, సత్యప్రసాద్ లు అందజేశారు..
పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ కష్ట సమయంలో సైబేజ్ కంపెనీ చేసిన సేవలు మరువలేనివని, పిల్లలకి చదువులకోసం చేస్తున్న సహాయం ఎప్పటికి మరువలేదునిది అని ఎప్పుడు సైబేజ్ కంపెనీ కి రుణ పడి ఉంటామని అన్నారు. సైబేజ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మామూనూరు సురేష్ మాట్లాడుతూ పిల్లలు కస్టపడి చదువుకోవాలని, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పుచ్చశర్మ మాట్లాడుతూ సబ్జెక్టు మీద ఇష్టం తో చదివితే సబ్జెక్టు ఈజీ గా అర్ధం అవుతుందని మంచి మర్క్స్ సాధించొచ్చు అని తెలిపారు. సి. ఎస్. ఆర్ ఎగ్జిక్యూటివ్ అనపురపు సురేష్ మాట్లాడుతూ కష్టాలు అందరికి వస్తాయని వాటిని ఎదుర్కొని నిలపడి పిల్లలని బాగా చదివిస్తే భవిష్యత్ లో వాళ్ళు మంచి ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలకు అండగా ఉంటారని తెలిపారు.
ఇప్పటి వరకు సైబేజ్ కోవిద్ సంజీవని ప్రోగ్రాం ద్వారా హైదరాబాద్ లో 115 స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ సపోర్ట్ గత సంవత్సరం నుండి చేస్తున్నామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు సైబేజ్ కి మరియు సైబేజ్ సి.ఈ.ఓ అరుణ్, సి.ఎస్.ఆర్ హెడ్ రీతూ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఆర్ ధనంజయ్, చైతన్య, అనూష,అడ్మిన్ ప్రేమ్, శ్వేతా, కిషోర్ మరియు సాయిరాం, విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…