Telangana

పటాన్చెరులో.. మహాశివరాత్రి రోజున మహా జాగరణ..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పటాన్చెరు పట్టణంలో మహా జాగరణ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మహా జాగరణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి రోజు సాయంత్రం 8:00 గంటల నుండి అర్ధరాత్రి 12:30 గంటల వరకు వేద బ్రాహ్మణులచే అభిషేకం, శివపార్వతుల కళ్యాణం, లింగోద్భావ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

అనంతరం తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రముఖ గాయకులు ఎస్పి చరణ్, వందేమాతరం శ్రీనివాస్, సునీత, ప్రముఖ యాంకర్ శ్రీముఖి, బిత్తిరి సత్తిల చే సంగీత విభావరి, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు..రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మెరాజ్ ఖాన్, కృష్ణ కాంత్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వ్యర్థాల నిర్వహణకు ఐటీసీ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ…

11 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం వాణి

ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

11 hours ago

ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం _ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం…

1 day ago

ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఆటోమేషన్ పై శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు…

1 day ago

ప్రకృతి ప్రేరణతో అద్భుత డిజైన్లు

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐఐటీ హైదరాబాదు అధ్యాపకుడు డాక్టర్ ప్రభాత్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రకృతి, భౌతికశాస్త్రం…

1 day ago

ఐనోల్ మల్లన్న స్వామి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…

2 days ago