_గ్రామీణ రోడ్లకు మహర్దశ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండల పరిధిలోని..పాటి, ఘనపూర్, కర్ధనూర్, నందిగామ, భానురు, రుద్రారం, క్యాసారం, పాశమైలారం, ఇస్నాపూర్, లక్డరం గ్రామాల పరిధిలో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రణాళికబద్ధంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. ఘనాపూర్ గ్రామం విశాఖ ఇండస్ట్రీస్ వరకు 2 కోట్ల 25 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, పంచాయతీరాజ్ డిఈ సురేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…