Telangana

చిట్కుల్ లో శాస్త్రోక్తంగా శ్రీ సీత రామ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

ముగిసిన ద్విదినాత్మక ప్రతిష్ఠాపన క్రతువులు

భక్తులకు దర్శనం ఇచ్చిన సీతా రాములు

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్థులు, కాలనీ వాసులు, భక్తులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ సొంత నిధులతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జిటిఎన్ కాలనీలో నిర్మించిన శ్రీ హనుమ సమేత సీతా రామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా ముగిసింది.గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా, బుధవారం తెల్లవారుజాము నుండే వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9:43 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తాన స్వామి వారి యంత్ర స్థాపన, బింబ స్థాపన, శిఖర స్థాపన ఘట్టాలను అత్యంత వైభవంగా పూర్తి చేశారు. అనంతరం మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ గావించి, నేత్రోన్మీలనము నిర్వహించారు.ఆలయ నిర్మాణంతో పాటు కాలనీలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు నీలం మధు ముదిరాజ్ తీసుకున్న ఈ చొరవను కాలనీ వాసులు కొనియాడుతున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం మూర్తులకు ప్రత్యేక కళా కుంభాభిషేకము, శ్రీ సీతారామ స్వామి దేవతా అర్చనలు నిర్వహించారు. మహానివేదన, మంగళ నీరాజనాల అనంతరం భక్తులకు రక్షాధారణ, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా రామనామ స్మరణతో చిట్కుల్ పుర వీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, భక్తులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago