Telangana

దోమడుగు అభివృద్ధికి సంపూర్ణ సహకారం

దోమడుగులో 79 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , గుమ్మడిదల :

నూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగు వార్డులో హెట్రో డ్రగ్స్ పరిశ్రమ సౌజన్యంతో 79 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, రక్షిత మంచినీటి పైపులైన్ల నిర్మాణ పనులకు బుధవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుమ్మడిదల మున్సిపల్ అభివృద్ధి కోసం ఇప్పటికే 15 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి అని తెలిపారు. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల యాజమాన్యాలు సంపూర్ణ సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, హెట్రో డ్రగ్స్ పరిశ్రమ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, దోమడుగు కౌన్సిలర్ రాజశేఖర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago