పటాన్చెరు
నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకోగా, 35 వేల రూపాయలు ఎల్వోసీ మంజూరైంది. ఈ మేరకు సోమవారం ఉదయం కృష్ణ కుటుంబ సభ్యులకు గూడెం మధుసూదన్ రెడ్డి ఎల్వోసీ అనుమతి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి, కార్మిక బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో సి ఎం ఆర్ ఎఫ్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక సహాయం లభిస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో నియోజక వర్గాన్ని ముందంజలో నిలుపుతున్నట్లు గూడెం మధుసూదన్ రెడ్డితెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రా బిక్షపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…