Districts

అంబరాన్నంటిన గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మనవార్తలు ,పటాన్చెరు

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు తోపాటు అమీన్పూర్, రామచంద్రాపురం, తెల్లాపూర్, పటాన్చెరు మండలాల పరిధిలో స్థానిక నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పటాన్చెరు పట్టణంలోని మహా దేవుని ఆలయం, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని తన సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అనునిత్యం తమ కష్టసుఖాల్లో వెన్నంటి నిలుస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, భారీ సంఖ్యలో అభిమానులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago