అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు స్పష్టత, దిశానిర్దేశం అందించే లక్ష్యంతో, గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్, శిక్షణ, మార్గదర్శనం, వృత్తిపరమైన సలహాలు (టీఎంసీజీ) డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను, కెరీర్ మార్గాలను నిర్మించుకోవడంలో సహాయపడటానికి రూపొందించిన సమగ్ర కెరీర్ మార్గ సూచీల శ్రేణిని ప్రవేశపెట్టారు.నేటి విద్యార్థులకు అపారమైన ఆశయాలు ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందుతున్న అనేక రంగాలలో సరైన వృత్తి మార్గాన్ని ఎంచుకోవడంలో వారు తరచుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని టీఎంసీజీ నిపుణులు గుర్తించారు. దానిని అధిగమించేలా, ప్రాథమిక అభ్యాసం నుంచి పరిశ్రమకు సిద్ధమయ్యే వరకు విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేసే నిర్మాణాత్మక అభ్యాస మార్గాలను వారు అభివృద్ధి చేశారు.
కృత్రిమ మేధ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, బ్లాక్ చెయిన్, వీఎల్ఎస్ఐ వంటి మరెన్నో సాంకేతికతలు అభివృద్ధి చెందడంతో, విద్యార్థులు తమ వృత్తి ప్రయాణాన్ని ఎక్కడ, ఎలా ప్రారంభించాలో గుర్తించడంలో తరచుగా తడబడుతున్నారు. ఈ అవసరాన్ని తీరుస్తూ, కొత్తగా ప్రారంభించిన మార్గ సూచీలు వృత్తి నిపుణులు కావాలనుకునే వారికి స్పష్టమైన, ఆచరణాత్మకమైక అభ్యాస మార్గాన్ని అందిస్తున్నాయి. సాంకేతికేతర కెరీర్ రంగాలతో సహా, మరిన్ని అదనపు మార్గ సూచీలు కూడా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయి.ఈ కార్యక్రమం గురించి డాక్టర్ రోజీనా మాథ్యూ మాట్లాడుతూ, టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, వృత్తిపరమైన విజయానికి నిరంతర అభ్యాసం అత్యవసరమని స్పష్టీకరించారు. తాము రూపొందించిన మార్గదర్శకాలు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఒక లక్ష్యంతో, నిర్మాణాత్మక మార్గదర్శనంతో అభివృద్ధి చెందుతున్న రంగాలను అన్వేషించంలో సహాయపడటానికి ఉద్దేశించినట్టు తెలియజేశారు.
‘ఏమి నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రాథమిక స్థాయి భావనల నుంచి పరిశ్రమకు సిద్ధంగా ఉన్న నిపుణులుగా ఎలా ఎదగాలి అనే విషయాలను విద్యార్థులు అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి ఈ మార్గ సూచీలను రూపొందించాం. ఒక విద్యార్థి ఒక రంగాన్ని మొదటిసారి అన్వేషిస్తున్నా లేదా నైపుణ్యాలను పెంచుకునే తదుపరి దశకు ప్రణాళిక వేస్తున్నా, ఈ వనరులు ఒక విలువైన ప్రారంభ బిందువుగా ఉపయోగపడతాయి’ అని డాక్టర్ రోజీనా వివరించారు.పరిశ్రమ పోకడలు, సాంకేతిక పురోగతులకు అనుగుణంగా నిరంతరం అధునాతనను సంతరించుకునే సజీవ పత్రాలుగా ఈ మార్గ సూచీలను రూపొందించారు. భవిష్యత్ అభ్యాసకులకు ఈ వనరులు ప్రయోజనకరంగా ఉండేలా చూసేందుకు, లేదా మెరుగుదల కోసం సూచనలు తెలియజేయమని విద్యార్థులను అధ్యాపకులు ప్రోత్సహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి దిశగా చురుకైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ‘ప్రారంభించడానికి ఉత్తమ సమయం నిన్న. రెండవ ఉత్తమ సమయం ఇప్పుడే’ అని వారు ప్రేరేపిస్తున్నారు.విద్యార్థులకు ఆచరణాత్మక మార్గదర్శనం, మెంటార్ షిప్, క్రమబద్ధమైన కెరీర్ అభివృద్ధి వనరులను అందించడం ద్వారా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నిపుణులను తీర్చిదిద్దడంలో గీతం యొక్క నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోంది.‘అన్వేషించండి, నేర్చుకోండి, నిర్మించండి, ఎదగండి’ అనేది ఈ పరివర్తనాత్మక కార్యక్రమానికి మార్గదర్శక సందేశంగా ఈ వినూత్న కార్యక్రమం నిలుస్తుంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…