Telangana

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు

క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఉద్యోగుల సంపూర్ణ అభివృద్ధి, శ్రేయస్సు పట్ల తన నిబద్ధతలో భాగంగా, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్, అధ్యాపకులు, సిబ్బంది పిల్లల కోసం వేసవి క్రీడా శిబిరాన్ని ప్రారంభించింది. వేసవి సెలవులలో వారికి క్రమబద్ధమైన క్రీడా శిక్షణను అందించడమే లక్ష్యంగా దీనిని ఆరు నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం రూపొందించారు.ఈ శిబిరంలో అనుభవజ్జులైన క్యాంపస్ కోచ్ ల మార్గదర్శనంలో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, క్రికెట్ లో శిక్షణను అందిస్తున్నారు. క్రమం తప్పని శిక్షణా తరగతుల ద్వారా, ఇందులో పాల్గొనేవారు జట్టు స్ఫూర్తి, క్రమశిక్షణ, పట్టుదల, క్రీడాస్ఫూర్తి వంటి విలువలను అలవరచుకుంటూ, ప్రాథమిక క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని పొందుతారు.శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా యువ మనస్సులను తీర్చిదిద్దడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి. చిన్న వయస్సులోనే పిల్లలకు క్రీడలను పరిచయం చేయడం ద్వారా, గీతం హైదరాబాద్ ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడానికి, క్రమశిక్షణను అలవర్చడానికి ప్రయత్నిస్తోంది.క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ నేతృత్వంలోని ఈ చొరవ, చైతన్యవంతమైన, సమ్మిళిత క్యాంపస్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై గీతం యొక్క నిరంతర దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అర్థవంతమైన భాగస్వామ్య అవకాశాలను కల్పించడం ద్వారా ‘గొప్ప ప్రదేశంలో తాము పనిచేస్తున్నాం’ అనే సంస్కృతిని పెంపొందించాలనే సంస్థ యొక్క విస్తృత మానవ వనరుల దార్శనికతకు అనుగుణంగా దీనిని రూపొందించారు.ఈ కార్యక్రమం గురించి క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ అధికారులు మాట్లాడుతూ, ఈ శిబిరం కేవలం క్రీడా శిక్షణకు మాత్రమే పరిమితం కాదని, ఇది చిరస్మరణీయ అనుభవాలకు వేదికగా నిలవడం, చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడం, గీతం కుటుంబాల మధ్య సామూహిక భావవను బలోపేతం చేయడం వంటి వాటికి సంబంధించినదని వివరించారు.తరగతి గదులు, కార్యాలయాలకు అతీతంగా అభ్యసనం, అభివృద్ధి విస్తరించి, వ్యక్తులు, కుటుంబాల సంపూర్ణ ఎదుగుదలకు, శ్రేయస్సుకు దోహదపడతాయన్న గీతం హైదరాబాద్ నమ్మకాన్ని ఈ వేసవి క్రీడా శిబిరం మరింత బలపరుస్తోంది.

admin

Recent Posts

పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్‌చెరులో అద్భుత ప్రగతి.. పటాన్‌చెరు ,మనవార్తలు…

1 hour ago

108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గర్భిణీ ని ఆసుప్రతికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమై 108 అంబులె‌న్స్‌లో ప్రసవించింది. పూర్తి…

1 hour ago

వేముకుంట మహాశక్తి లలితా పోచమ్మ ఆలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : వేముకుంట గౌతమినగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో ఆదివారం…

1 hour ago

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కంజర్ల కృష్ణమూర్తి

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : పటాన్‌చెరు నియోజకవర్గంలో గల భారతీనగర్‌ డివిజన్‌లో నిర్వహించిన సుమారు 19 దేవి శరన్నవరాత్రి…

1 hour ago

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

21 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

1 day ago